పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ రిలీజ్

పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ రిలీజ్

పవన్ పర్యటన.. రూట్ మ్యాప్ రిలీజ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 24న జనసేనాని పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా , కొండగట్టు పర్యటన రూట్ మ్యాప్ రిలీజ్ అయింది. జనవరి 24 న హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత వారాహికి వాహన పూజ జరుపుతారు. మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.