కేసీఆర్ ఘనతతోనే రామప్పకు వైభవం : కవిత

కేసీఆర్ ఘనతతోనే రామప్పకు వైభవం : కవిత

కేసీఆర్ ఘనతతోనే రామప్పకు వైభవం : కవిత

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా ప్రజల పోరాటం, సీఎం కేసీఆర్ ఆరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం రామప్ప దేవాలయాన్ని ఆమె గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి సందర్శించారు. ముందుగా రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రామప్ప శిల్పకళను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.కేసీఆర్ ఘనతతోనే రామప్పకు వైభవం : కవితరామప్ప వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ కళాకారుల ప్రతిభకు ఆలయం ఒక నిదర్శనమని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ములుగు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి యునెస్కో గుర్తింపు దక్కిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాలంపేట ప్రజలు, మేధావులు పాండురంగారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, గ్రామానికి చెందిన వీరమల్ల ప్రకాశ్ రావు, రామప్ప పరిరక్షణ కమిటీ యునెస్కో గుర్తింపునకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

వెయ్యేళ్ల కింద 1213 లో రేచర్ల రుద్రుడు రామప్పను నిర్మిస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రామప్ప డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తున్నట్లు కవిత చెప్పారు.