ఫిబ్రవరి 1న కంఠస్థ పఠన పోటీలు : ఇ.అమ్మడు

ఫిబ్రవరి 1న కంఠస్థ పఠన పోటీలు : ఇ.అమ్మడు

వరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న అచ్యుతాష్ఠకం మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర కంఠస్థ పఠన పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలు గుంటూరు రాజాగారి తోటలోని టీటీడే కళ్యాణమండపం నందు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు ఇ.అమ్మడు తెలిపారు. 10 యేళ్ల లోపు విద్యార్థులకు అచ్యుతాష్టకం, 10 నుండి 15 యేళ్ల వయస్సులోపు విద్యార్థులకు విష్ణు సహస్రనామ స్తోత్ర కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులలో భక్తి భావన పెంపొందించుటకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వహకులు అన్నారు. ఈ కార్యక్రమాలకు ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జనవరి 30వ తేదీ లోపు వివరాలు నమోదు చేసుకోవాలని ఇతర వివరములకు 9989023329 ను సంప్రదించగలరని తెలిపారు.