రెండో వన్డేలో కివీస్ పై టీంఇండియా విక్టరీ

రెండో వన్డేలో కివీస్ పై టీంఇండియా విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన షహీద్ వీర్ నారాయణ్ సింగ్ మైదానంలో టీంఇండియా సత్తా చాటింది. శనివారం రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కివీస్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్రమశిక్షణ, ఖచ్ఛితత్వంతో భారత బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.

ఆ జట్టులో ఫిలిప్స్ (36), బ్రాస్ వెల్ (22), శాంటర్న్ (27) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ షమి (3/18), హార్దిక్ పాండ్య (2/16), వాషింగ్టన్ సుందర్ (2భ7) చెలరేగాడు. ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా 20.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 ; 50 బంతుల్లో 7×4, 2×6), శుభ్ మన్ గిల్ ( 40 నాటౌట్ ; 53 బంతుల్లో 6×4) సత్తా చాటారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది.