బ్రహ్మోత్సవాల గోడపత్రికలను విడుదల చేసిన చల్లా

బ్రహ్మోత్సవాల గోడపత్రికలను విడుదల చేసిన చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గీసుగొండ మండల కొమ్మాల గ్రామ శివారులోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 10 నుండి 24 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రిక మరియు కరపత్రికలను మంగళవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని ఆయన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈ.ఓ. బ్రహ్మోత్సవాల ఆహ్వాన శుభప్రతికను ఎమ్మెల్యే చల్లాకు అందచేసి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల గోడపత్రికలను విడుదల చేసిన చల్లా ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, ఎప్పటికప్పుడు ఆలయ కమిటి మరియు అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ నెల 14 న జరిగే స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తాను కూడా కుటుంబ సమేతంగా పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ, సర్పంచులు, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.