మహిళల ఆత్మ బంధువు కేసీఆర్ : ఎమ్మెల్యే చల్లా

మహిళల ఆత్మ బంధువు కేసీఆర్ : ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్రంలో పేదప్రజల అభివృధ్ధికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వారి ఆత్మగౌరావాన్ని పెంచారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మహిళా బంధు పేరిటి మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేడు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. హనుమకొండలోని ఆయన నివాసంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలోని 19 మంది లబ్ధిదారులకు రూ. 19 లక్షలకు పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.మహిళల ఆత్మ బంధువు కేసీఆర్ : ఎమ్మెల్యే చల్లాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రత కోసం షీ టీమ్స్ మరియు సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఆత్మ రక్షణ కల్పించారన్నారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఆ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షీమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దళారుకు తావివ్వకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఘనత కేసీఆర్ గారిదన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామనులందరికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.మహిళల ఆత్మ బంధువు కేసీఆర్ : ఎమ్మెల్యే చల్లాచెక్కులు తీసుకున్న లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పుట్టింటి కష్టాలు తీరుస్తున్నాడని కొనియాడారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.100116 /- ఇచ్చి పెద్ద దిక్కుగా నిలిచారని, పేదవాళ్ల కష్టాలు అర్ధంచేసుకున్న కేసీఆర్ పేదవారికి అండగా నిలవడం తమ అదృష్టమని అన్నారు. చెక్కులు అందించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, మార్కెట్ డైరెక్టర్, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.