ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దామెర మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లాఈ వేడుకలను పురస్కరించుకుని దామెర మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులను, అంగన్వాడీ టీచర్లను, ఆశా మరియు ఐకేపీ మహిళా అధికారులను శాలువాలతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సన్మానించారు. అనంతరం వారికి గిఫ్ట్ లు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళామనులందరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.