సాఫ్టెక్ కంప్యూటర్స్ లో మహిళలకు ఉచిత శిక్షణ

సాఫ్టెక్ కంప్యూటర్స్ లో మహిళలకు ఉచిత శిక్షణ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాప్టెక్ కంప్యూటర్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ దండె మధుమిత తెలిపారు. మంగళవారం బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధుమిత దీనికి సంబంధించిన వివరాలు తెల్పింది. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారని ఆమె అన్నారు. ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు పరిగెడుతున్న తరుణంలో ప్రతీ మహిళకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని ఆమె సూచించారు. తద్వారా కుటుంబం, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే అవకాశం ఉన్నందని అన్నారు.సాఫ్టెక్ కంప్యూటర్స్ లో మహిళలకు ఉచిత శిక్షణఅంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రతీ సంవత్సరం వందలాది మంది మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 200 మంది మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణనివ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము అన్నారు. దరఖాస్తులు సాప్టెక్ కంప్యూటర్స్ కిషన్ పుర, అదాలత్ బ్రాంచ్ లో మార్చి 12వరకు అందజేయాలని అని ఆమె తెలిపారు.ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు 9246899300, 9246899319 నంబర్ల పై సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు రవి, నరేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.