అంబరాన్నంటిన ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు

అంబరాన్నంటిన ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెన ఈ వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మొదటి రోజు వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో యేడున్నరేళ్లుగా మహిళాభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిని లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. ఆదివారం మొదటి రోజు సీఎం కేసీఆర్ ఫోటోకు రాఖీలు కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కల్గిన విద్యార్థినులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

హనుమకొండ జిల్లాలో..
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు ఘనంగా జరిగాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన పలు కార్యక్రమాలలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ అవరణలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో దాదాపు 30 శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులకు క్రీడలు ప్రారంభించారు. 4వ డివిజన్ యాదవనగర్ లో టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, రాఖీలు కట్టి, మహిళా బంధు కేసీఆర్ కు థాంక్స్ అంటూ నినాదాలు చేశారు.

అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలు

వడ్డెపల్లి ఎక్సైజ్ కాలనీ రాజీవ్ పార్క్ లో 58,59,60వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి రాఖీలు కట్టారు. తదనంతరం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు పారిశుద్ధ్య కార్మికులకు చిరు సత్కారంగా బహుమతులు అందజేశారు. అంబేద్కర్ భవన్ లో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఐసిడిఎస్ మహిళా ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చిరు సన్మానం చేసి బహుమతులు అందజేశారు.

పరకాల నియోజకవర్గంలో..
ఆదివారం పరకాల పురపాలక సంఘంలో ఏర్పాటుచేసిన మహిళా సఫాయి కార్మికుల సన్మాన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మహిళా సఫాయి కార్మికులను సన్మానించారు. ఈ వేడుకల్లో భాగంగా పరకాల పురపాలక సంఘం మహిళ కౌన్సిలర్లు, మహిళా సఫాయి కార్మికులు, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిల చిత్రపటాలకు రాఖీ కట్టి వేడుకలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులను వారు కొనియాడుతూ కేసీఆర్ కు థాంక్స్ చెప్పారు.అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలువర్ధన్నపేట నియోజకవర్గంలో..
హసన్ పర్తి మండలం నాగారం గ్రామంలో మహిళా బందు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి, ఎమ్మెల్యేకు పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు రాఖీలు కట్టారు. వీరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఘనంగా సన్మానించారు.అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలు

గ్రేటర్ వరంగల్ పరిధిలో ..
మహిళ సాధికారత కు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా 29 వ డివిజన్ రామన్న పేటలోని డా.బాబు జగ్జీవన్ రామ్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి, మహిళా పారిశుద్ధ్య, వైద్య, ఆరీపిలను మేయర్ గుండు సుధారాణి ఘనంగా శాలువాలతో సన్మానించి చీరలను అందజేశారు.అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలుజయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
గణపురం మండలంలో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా బంధు కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాలలో ప్రజలకు సేవలు చేస్తున్న మహిళలను ఎమ్మెల్యే గండ్ర శాలువాతో సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం కేసిఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గణపురం మండలంలోని గణపురం, రంగారావు పల్లి, కర్కపల్లి, మైలారం గ్రామాల్లో రూ. 55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలుమహబూబాబాద్ జిల్లాలో..
మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. గత వారం రోజులుగా హాస్పిటల్ లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్స్ అందించారు. మహిళల కోసం ముఖ్యంగా బాలింతలు, గర్భిణుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించారు. బాలింతలకు కేసీఆర్ కిట్స్ ఇచ్చి, అందులో ఉన్న వస్తువుల గురించి వివరించారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగారు.
అనంతరం ఈ సంబరాల్లో భాగంగా మహిళల కోసం, సమాజం కోసం పాటుపడిన అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులను సన్మానించారు.

అంబరాన్నంటిన 'కేసీఆర్ మహిళా బంధు' సంబురాలు