తొలి ఇన్నింగ్స్ లో 174 రన్స్ కు శ్రీలంక ఆలౌట్

తొలి ఇన్నింగ్స్ లో 174 రన్స్ కు శ్రీలంక ఆలౌట్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మొహాలీలో జరుగుతున్న భారత్, శ్రీలంక తొలి టెస్టులో శ్రీలంక జట్టు 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు 400 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో సత్తా చాటిన రవీంద్ర జడేజా బౌలింగ్ లోనూ రాణించి శభాష్ అనిపించుకున్నాడు. జడేజా ఈ మ్యాచ్ లో 175 పరుగులు చేసి 5 వికెట్లు తీయడం విశేషం.తొలి ఇన్నింగ్స్ లో 174 రన్స్ కు శ్రీలంక ఆలౌట్భారత్ తొలి ఇన్నింగ్స్ ను 574 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేపట్టింది. అశ్విన్, బుమ్రాకు రెండేసి వికెట్లు పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. భారత్ జట్టులో పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేయగా విహారి 58, వంద టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 పరుగులు చేసి విషయం తెలిసిందే.