బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకం

బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకం

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : పంజాబ్ లోని అమృత్ సర్ బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు సైనికులు చనిపోయారు. అమృత్ సర్ సమీపంలోని ఖాసా బెటాలియన్ బీఎస్ఎఫ్ శిబిరంలో సట్టెప్పా అనే జవాన్ తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకంఅనంతరం తాను కూడా కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన జవాన్లను తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. కాగా, కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.