పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : న్యూజీలాండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ టోర్నీలో దాయాది పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ లో జరిగిన తన తొలి మ్యాచ్ లోనే భారీ విజయంతో భారత్ వరల్డ్ కప్ టోర్నీని మొదలుపెట్టింది. ఏకంగా 107 పరుగుల తేడాతో పాకిస్థాన్ జట్టును మట్టి కరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రేకర్ (67), స్నేహ్ రాణా (53) అర్ధ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో నశ్రా సంధు, నిడా దర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీఅనంతరం 245 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తడబడింది. టాప్ ఆర్డర్ టపీటపీమని కుప్పకూలడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ నడ్డి విరిచింది. ఇక పాకిస్థాన్ బ్యాటర్లలో సిద్రా అమీన్ మాత్రమే 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. పూజా వస్త్రేకర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.