కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన అరూరి
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్ల సింగారం గ్రామానికి చెందిన 5మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల 580 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన నివాసంలో అందించారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్ల భారం తగ్గిందని అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.