100వ రోజు చేరుకున్న సీతక్క సేవలు

100వ రోజు చేరుకున్న సీతక్క సేవలు

వరంగల్ టైమ్స్, ములుగుజిల్లా: లాక్ డౌన్ కాలంలో పేదల ఆకలి తీర్చడంలో ఎంతో సంతృప్తి కలిగిందని, పేదల ఆకలి తీర్చడంలో సహకరించిన దాతల సాయం మరువలేనిదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా రాష్త్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా వుండేందుకు ఎమ్మెల్యే సీతక్క గో హంగర్ గో కార్యక్రమాన్ని చేపట్టింది. గో హంగర్ గో నినాదంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమం చేపట్టి 100 రోజులు 100వ రోజు చేరుకున్న సీతక్క సేవలుపూర్తిచేసుకున్న సందర్భంగా ములుగు జిల్లాకేంద్రంలోని మహర్షి జూనియర్ కాలేజీలో సీతక్క మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ . క్రిష్ణా ఆదిత్య, ఏఎస్పి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీతక్క రక్తదానం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా పేదల ఆకలి తీరుస్తూ, కాలిదెబ్బను సైతం లెక్కచెయకుండా పేదల పక్షాన నిలబడుతూ గో హంగర్ గో కార్యక్రమాన్ని అలుపెరగకుండా కొనసాగిస్తున్న సీతక్కను కలెక్టర్ , ఏఎస్పి తో పాటు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందించి, ఆమెను గజమాలతో సత్కరించారు. కలెక్టర్ , ఏఎస్పీలను శాలువాలతో సన్మానించారు. ఈ మెగా రక్తదాన శిబిరానికి భారి స్పందన లభించింది. జిల్లాలోని యువకులతో పాటు100వ రోజు చేరుకున్న సీతక్క సేవలుసీతక్క అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం 100రోజులు విజయవంతంగా పూర్తిచేసుకోవడంలో సహకరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, వివిధ మండలాల అధ్యక్షులు , దాతలకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ అందచేశారు.