శుక్రవారం రికార్డుస్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. శుక్రవారం రికార్డుస్థాయిలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో1,658 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌మల్కాజిగిరి 44, వరంగల్‌రూరల్ 41, సంగారెడ్డి 20, నల్లగొండ 13, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 7, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 6 చొప్పున, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ 3 చొప్పున, నిర్మల్, ఖ మ్మం 2 చొప్పున, కరీంనగర్, జోగుళాంబ గద్వా ల, ములుగు, జగిత్యాల, వరంగల్‌అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ 1 చొప్పున రికార్డయ్యాయి. చికిత్స అనంతరం కోలుకొన్న 1,126 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రా ణాలు కోల్పోయారు. రాష్ట్రం లో ఇప్పటివరకు మొత్తం 1,04,118 పరీక్షలుచేయగా, 20,462 పాజిటివ్‌గా నిర్ధారణ తే లింది. మొత్తం 283 మంది మరణించారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.