ముద్రా, జ్వాలామాలిని క్రమాల్లో శ్రీ భద్రకాళి

ముద్రా, జ్వాలామాలిని క్రమాల్లో శ్రీ భద్రకాళివరంగల్ అర్బన్ జిల్లా: శ్రీ భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారు ఉదయము ముద్రా క్రమం, సాయంత్రము జ్వాలా మాలినీ క్రమములో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు శాకంబరీ అవతారాల్లో వున్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పుణీతులయ్యారు.