ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం క్లస్టర్ గ్రామమైన సముద్రాల గ్రామంలో 22 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు వేదిక భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శంకుస్థాపన చేశారు. అయితే రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుండగానే గ్రామస్తులు మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు, గతంలో ఆ స్థలంలో వారికి పట్టాలు ఇచ్చారని, అదే స్థలంలోఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

ఇప్పుడు రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. తమ ఫ్లాట్ లను తమకు అప్పగించాలని ఆందోళన చేశారు. పోలీసులు వారిని సముదాయించి గొడవ కాకుండా అడ్డుకున్నారు. దీంతో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హరితహారం లో మొక్కలు నాటకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు