హరిత జయ లక్ష్యం నెరవేరుస్తాం: కలెక్టర్ అబ్దుల్ అజీం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : పుడమితల్లి పులకించేలా జిల్లాలో 30 నిమిషాల్లో మూడు లక్షల మొక్కలను నాటడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. హరిత జయ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో వినూత్నంగా ఈ ఒక్కరోజే ఉదయం 10 గంటలనుండి 10:30 గంటల సమయంలో 30నిమిషాల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మొక్కలను నాటాలని మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషి చేసింది. హరిత జయ లక్ష్యం నెరవేరుస్తాం: కలెక్టర్ అబ్దుల్ అజీంఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుటకు సిద్ధం చేసిన 5 లక్షల గుంతలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 30 నిముషాల్లో 3 లక్షల మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లాలో పచ్చదనం అందించేందుకు ఈ సంవత్సరం హరిత జయ కార్యక్రమం ద్వారా 63 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఈరోజుతో కలిపి 18 లక్షల మొక్కలు నాటడం జరిగిందని లక్ష్యానికి మించి జిల్లా అధికార యంత్రాంగం 90 లక్షల వరకు మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. అయినప్పటికీ ప్రజల కోరిక మేరకు ఒక కోటి మొక్కలకు పైన జిల్లా వ్యాప్తంగా నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీ.ఎఫ్.ఓ. కే.పురుషోత్తం, జిల్లా పంచాయతీ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చంద్రమౌళి,అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.