బిగ్‌బాస్ 3 పాపుల‌ర్ ర‌వికృష్ణకు క‌రోనా

హైదరాబాద్: ప్ర‌భుత్వం స‌డ‌లింపుల‌తో క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ సీరియ‌ల్ పరిశ్ర‌మ షూటింగ్స్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. బిగ్‌బాస్ 3 పాపుల‌ర్ ర‌వికృష్ణకు క‌రోనాతాజాగా బిగ్‌బాస్3తో పాపుల‌ర్ అయిన ర‌వికృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న‌కి కరోనా సోకింద‌ని తెలిపారు ర‌వికృష్ణ‌. ప్ర‌స్తుతం తాను క్షేమంగానే ఉన్న‌ట్టు తెలిపిన ర‌వికృష్ణ గ‌త మూడు రోజులుగా ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారిని ప‌రీక్షించి ఆ త‌ర్వాత ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందించాల‌ని అభ్య‌ర్ధించాడు ర‌వికృష్ణ‌. వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ స‌మ‌యంలో ఎవ‌రు బ‌య‌ట‌కి రావొద్ద‌ని కోరుతున్నాడు. ర‌వికృష్ణ ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.