చెట్లే మానవ మనుగడకు జీవనాధారం: గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక వంద పడకల ఆసుపత్రి ఆవరణలో 30 నిమిషాలలో 3 లక్షల మొక్కలు అనే నినాదంతో మెగా హరిత హారంలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ చెట్ల వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు.