చిన్నారులను మింగిన తుమ్మల చెరువు

చిన్నారులను మింగిన తుమ్మల చెరువు

వరంగల్ టైమ్స్, శనిగపురం: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామం బోధతండాకి చెందిన నలుగురు చిన్నారులు స్థానిక తుమ్మల చెరువులో ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. విషయాన్ని గమనించిన స్థానికులు గల్లంతైన చిన్నారులను ప్రాణాలతో వెలికితీసే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో నలుగురు బాలురులు ఇస్లావత్ లోకేష్ , ఇస్లావత్ ఆకాష్, బొడా దినేష్, బొడా జగన్లు ప్రాణాలు వదిలారు. నలుగురు మృతదేహాలను వెలికితీయడంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిన్నారులను మింగిన తుమ్మల చెరువు