బాబు మాస్క్ ‘బంగారం’

పూణే జిల్లా: కరోనాతోనూ కామెడీలు చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న  ఈ వైరస్ పై వచ్చిన జోకులు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు భయం..మరో వైపు కామెడీ. ఇప్పటికే దేశంలో రకరకాల మాస్క్ లు వచ్చాయి. కరోనా నుంచి రక్షణగా వీటిని వాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా మాస్క్ లు లేకుండా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయటంతోపాటు..అలా చేసిన వారికి జరినామాలు కూడా విధిస్తున్నాయి. కానీ ఈయన ఏకంగా దాదాపు మూడు లక్షల రూపాయల వ్యయం చేసి ఏకంగా బంగారం మాస్క్ తయారు చేయించుకున్నాడు.బాబు మాస్క్ ‘బంగారం’

ఆ వ్యక్తి పేరు శంకర్ కురాడే. పూణే జిల్లాలోని పింప్రి చించివాడ్ ప్రాంత వాసి. 2.9 లక్షల రూపాయల వ్యయంతో ఈ బంగారం మాస్క్ చేయించుకున్నాడు. గాలి పీల్చటానికి వీలుగా దీనికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టించాడు. అయితే ఈ మాస్క్ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుందో తనకు తెలియదని వ్యాఖ్యానించాడు. ఒక్క మాస్కే కాదు ఆయన మందపాటి పలువరసలతో కూడి ఓ బంగారు చైన్ కూడా ధరించాడు. ఈ బంగారు మాస్క్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.