గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీ..వాటి వివరాలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ నేడు 30, 453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 503 పోస్టులను టీఎస్పీఎస్పీ ద్వారా భర్తీ చేయనున్నది. ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38 భర్తీ చేయనున్నది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ 20 ( పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ), డీఎస్పీ 91, జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు 2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 35 భర్తీ చేయనున్నది.
వీటితో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు రెండింటిని భర్తీ చేయనున్నది.