12 యేళ్ల తర్వాత పాక్ సంచలనం

12 యేళ్ల తర్వాత పాక్ సంచలనం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : పాకిస్తాన్ మహిళలు చరిత్ర సృష్టించారు. 12 యేళ్ల తర్వాత క్రికెట్ వరల్డ్ కప్ లో తొలి విజయం రికార్డు చేశారు. వెస్టిండీస్ తో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్ వరుసగా 18 మ్యాచుల్లో ఓటమి పాలైంది. 12 యేళ్ల తర్వాత పాక్ సంచలనంవర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట వెస్లిండీస్ బ్యాటింగ్ చేసింది. పాక్ స్పిన్నర్ నిదార్ దాస్ కేవలం 10 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఆమెతో పాటు ఫాతిమా సనా, నష్రా సందు, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీసుకున్నారు.

వీళ్లంతా లిమిట్ గా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి విండీజ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగల్గింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సిద్రా అమీన్ (8) స్వల్ప స్కోరుకే వెనుతిరిగింది. అయితే మరో ఓపెనర్ మునీబ్ అలీ (37)తో జత కట్టిన కెప్టెన్ బిస్మా మరూఫ్ (20 నాటౌట్ ) జట్టును ముందుకు నడిపించింది.

చివరకు ఒమైమా సొహైల్ ( 22నాటౌట్) తో కలిసి జట్టుకు విజయాన్నందించింది. పాక్ జట్టు మరో 7 బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 2009 తర్వాత ప్రపంచకప్ పోటీల్లో పాక్ కు ఇదే తొలి విజయం కావడంతో ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.