డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్, పరారిలో మరో ఇద్దరు

డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్, పరారిలో మరో ఇద్దరు

వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ ప్లాజాలోని పబ్‌ పై ఆదివారం జరిగిన పోలీసులు రైడింగ్ లో 150మందిని అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. అందులో నలుగురిపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మిగతా వారిని వదిలిపెట్టారు. పోలీసులు విచారించి వదిలిపెట్టిన వారిలో ముఖ్యంగా కొణిదెల నిహారిక, పాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్, పరారిలో మరో ఇద్దరుఇక ఈ కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదైన వారిలో పబ్ నిర్వహకులు అనిల్ కుమార్ ( ఏ1), అభిషేక్ ఉప్పల (ఏ2), అర్జున్ వీరమాచినేని ( ఏ3) , కిరణ్ రాజ్ ( ఏ4) లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ విధించి, చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగతా ఇద్దరు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజ్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపట్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ర్యాడిసన్ బ్లూ హోటల్ ను 2017లో కిరణ్ రాజ్, అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ పబ్ ను నడిపారు. 2020 ఆగస్టులో అభిషేక్ ఉప్పల , అనిల్ కుమార్ కు కిరణ్ లీజుకు ఇచ్చాడు. 2022, జనవరి నుంచి పబ్ ని అభిషేక్ ఉప్పల, అతని టీం ఆపరేట్ చేస్తున్నారు. పబ్ ను అభిషేక్ కు లీజుకు ఇచ్చినప్పటికీ కిరణ్ పార్ట్ నర్ గా కొనసాగుతున్నాడు. ఇందులో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టింది అభిషేక్. ప్రస్తుతం కిరణ్ రాజు పేరుతో లిక్కర్ లైసెన్స్ ఉంది. అర్జున్ వీరమాచినేని కొద్ది కాలం క్రితం పబ్ లో పార్ట్ నర్ గా జాయిన్ అయ్యాడు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్, ర్యాడిసన్ బ్లూ హోటల్ ను ప్రస్తుతం ఈ ముగ్గురు నడిపిస్తున్నట్లు సమాచారం.

ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రూల్స్ అతిక్రమించి, అర్థరాత్రి ఒంటి గంట తర్వాత కూడా క్లోజ్ చేయకుండా నడపడంతో పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు పబ్ పై శనివారం అర్ధరాత్రి 1. 30 ని.లకు రైడ్ చేశారు. 1.30 ని. ల నుంచి ఆదివారం తెల్లవారు జామున 3.30 ని. ల వరకు పోలీసుల రైడ్ కొనసాగింది. ఈ రైడ్ లో 150 మందిని అదుపులోకి తీసుకోగా, వీఐపీలు, సెలబ్రిటీలకు సంబంధించి 125 మంది ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ లిస్టులో 37వ నెంబర్‌గా కొణిదెల నిహారిక పేరును, 38వ నెంబర్‌గా మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె పేరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లిస్టులో20 పబ్‌ స్టాఫ్‌ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పబ్ కు వెళ్లిన వారిలో బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలకు చెందిన కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.

కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు అభిషేక్ సెల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. అతని ఫోన్ లో కీలక సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పబ్ కు 40 ప్యాకెట్ల డ్రగ్స్ ను సరఫరా చేసిన వ్యక్తి కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుంది. ఆ వ్యక్తి అరెస్ట్ అయితే ఈ సరఫరా ఎక్కడి నుంచి కొనసాగుతుందనే విషయాన్ని పూర్తిగా తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.