యాదాద్రిలో 6వ రోజు పంచ కుండాత్మక యాగం

యాదాద్రిలో 6వ రోజు పంచ కుండాత్మక యాగం

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ క్రతువుల్లో భాగంగా నిర్వహిస్తున్న పంచ కుండాత్మక యాగం 6వ రోజుకు చేరుకుంది. ఈ రోజు యాగంలో ఉదయం వేళ శాంతిపాఠం, చతుస్థానార్చన, ఏకశీతి కలశాభిషేకం, పూర్ణాహుతి, ధ్వజకుంభారాధనలు నిర్వహించారు. సాయంత్రం వేళ స్వామి వారికి వేదపండితులు ధాన్యాధివాసం, విష్ణు సహస్రనామ పారాయణాలు, నిత్య లఘు పూర్ణాహుతి పూజలు నిర్వహించనున్నారు.