పది రోజుల్లో గ్రూప్ -1 నోటిఫికేషన్ ! 

పది రోజుల్లో గ్రూప్ -1 నోటిఫికేషన్ !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం పోస్టుల్లో 19 శాఖలకు చెందినవి ఉన్నట్లుగా సమాచారం. ఇండెంట్ కోసం టీఎస్పీఎస్సీ అధికారులు 19 శాఖల ఉన్నతాధికారులతో మరోసారి శనివారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయాశాఖల అధికారులకు నిర్దేశిత ప్రొఫార్మాను అందచేశారు. అన్ని వివరాలు సకాలంలో అందితే ఏప్రిల్ లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది.

ప్రొఫార్మారాలో ఉండేవి ఇవే..
పోస్టులు భర్తీ చేసే శాఖ పేరు
ఆయా శాఖలోని పోస్టుల సంఖ్య
పోస్టు పేరు, క్యాటగిరీ ( జోన్, మల్టీజోన్ )
స్కేల్ ఆఫ్ పే ( ప్రారంభ వేతనం )

ఆయా పోస్టులకు అర్హతలు
రోస్టర్ పాయింట్స్ ( 1 నుంచి మొదలవుతుందా, బ్యాక్ లాగ్ పోస్టులా, పాత రోస్టర్ కు కొనసాగింపులా )
ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు
అర్హతలను పేర్కొనడంతో పాటు జీవోలను జతచేయడం ( అకౌంట్స్ ట్రెజరీ ఆఫీసర్, మరికొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలుంటాయి. వాటికి సంబంధించిన జీవోలు)
రాష్ట్ర సబార్డినేట్ రూల్స్, శాఖల వారీగా అమల్లో ఉన్న నిబంధనలను, ఉత్తర్వులను జతచేయడం
పోస్టుల విభజన ( గతంలో స్టేట్ పోస్టుగా ఉన్నవి మల్టీజోనల్ పోస్టులయ్యాయి. ) వీటిని విభజించాలి. అంటే 4 పోస్టులుంటే రెండు మల్టీ జోన్లకు రెండు చొప్పున, మూడు ఉంటే ఒక మల్టీ జోన్ కు 1, మరో మల్టీ జోన్ కు 2 పోస్టులను విభజించడం.