అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

వరంగల్ టైమ్స్ , వరంగల్ జిల్లా : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండ్రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టుబడుతూ నేడు అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెల్పడంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని ప్రశ్నించారు.అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్ లు కోరారు. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంగా చిడతలు వాయించుకోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఒక్క సమస్యను ఎన్ని రోజులు సాగదీస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు ఏపీలో చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను రద్దు చేశారని తెలిపారు.