ఆ రాష్ట్రంలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

ఆ రాష్ట్రంలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

అమరావతి :ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సేవలు, పెట్రో బంకులు, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది లాంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే వారికి, సరుకు రవాణా వాహనాలకు కూడా మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఖచ్ఛితంగా కొవిడ్ నిబంధనలను పాటించాలని తెల్పింది. లేదంటే 10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.