ఐజీ బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సీపీ

ఐజీ బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సీపీవరంగల్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఐజీగా పదోన్నతి పొందిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం ఐజీ హెూదాలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు స్వీకరించారు. నేడు వరంగల్ కమిషనరేట్ కార్యాలయము చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుగా సాయుధ పోలీసుల గౌరవాన్ని స్వీకరించి తన కార్యాలయములో ఐజీ హోదాలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తూ పలు దస్త్రాలపై సంతకాలు చేశారు.

ఐజీగా పదోన్నతి పొందిన పోలీస్ కమిషనర్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన డీసీపీలు ఈస్ట్ వెంకటలక్ష్మి, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయి చైతన్య, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్పారెడ్డి, పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, ఏఆర్ ఆదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్ తో పాటు ఎ.సీ.పీ లు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు సబ్-ఇన్స్పెక్టర్లు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది వరంగల్ పోలీస్ కమిషనర్ కు పుష్పాగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.