ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఇక తిరుమ‌ల‌కు అనుమ‌తి

ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఇక తిరుమ‌ల‌కు అనుమ‌తి

తిరుమ‌ల: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ మ‌రొక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ఇదివ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని ప‌లు మార్లు తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే. ప‌లువురు భ‌క్తులునెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. దీనివ‌ల‌న అనేక మంది భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు.

కొవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు. కావున భక్తులు త‌మ‌ ఆరోగ్యం, అదేవిధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరింది,