సైఫ్ ఐనా..సంజయ్ ఐనా వదిలిపెట్టం : కేటీఆర్

సైఫ్ ఐనా..సంజయ్ ఐనా వదిలిపెట్టం : కేటీఆర్

సైఫ్ ఐనా..సంజయ్ ఐనా వదిలిపెట్టం : కేటీఆర్వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మెడికో ప్రీతి ఆత్మహత్యను కొందరు రాజకీయం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రీతి మృతికి కారకులెవరైనా వదిలిపెట్టేది లేదంటూ కేటీఆర్ గట్టిగానే స్పందించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సోడాషపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.

 

మెడికో ప్రీతి మరణం తమనెంతో కలచివేసిందన్నారు. ర్యాగింగ్ కు బలైన ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారంటూ కేటీఆర్ కొందరిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ర్యాగింగ్ కు గురై ప్రీతి చనిపోతే కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక నిందితుడు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలి పెట్టబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ బాధిత కుటుంబానికి సభా ముఖంగా భరోసా ఇచ్చారు.