నేటి నుంచి అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ కేటాయింపులపై చర్య జరుగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. మొదటి రోజైన నేడు సంక్షేమం, రహదారులు-భవనాలు, రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటక, క్రీడాశాఖలకు సంబంధించిన మొత్తం 12 పద్దులపై చర్చించనున్నారు. సభ ప్రారంభమవగానే ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ఎస్ఆర్డీపీ , గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.ఇక మండలిలో బడ్జెట్ పై చర్చ కొనసాగనుంది. అనంతరం మంత్రి హరీష్ రావు సమాధానం ఇస్తారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.