టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బౌలింగ్ కు దిగనుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా సూర్యకుమార్, తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ టెస్ట్ మ్యాచుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. సూపర్ ఫాంలో ఉన్న శుభ్ మన్ గిల్ ను కాదని హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ కు జట్టు యాజమాన్యం చోటు కల్పించింది. అదే విధంగా 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రవీంద్ర జడేజా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో వరుస సిరీస్ విక్టరీలతో జోరు మీదున్న టీంఇండియా, ఆస్ట్రేలియాతో బిగ్ ఫైట్ కు సిద్ధమైన విషయం తెలిసిందే.

తుది జట్లు :
టీం ఇండియా : రోహిత్ ( కెప్టెన్), కోహ్లీ, కేఎల్ రాహుల్, పుజారా, జడేజా, భరత్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, సిరాజ్, షమీ, అశ్విన్.

ఆస్ట్రేలియా టీం : కమిన్స్ ( కెప్టెన్), వార్నర్, అలెక్స్ కారీ, లియాన్, మర్ఫీ, బొలాండ్, హ్యాండ్స్ కోంబ్, ఖవాజా, లబుషేన్, స్మిత్, మ్యాట్ రెనషా.