వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! 

వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి దాస్యం వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాస్యం ప్రణయ్ భాస్కర్ తమ్ముడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వినయ్ భాస్కర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఆయనకు ఎంట్రీ వరకే కలిసొచ్చింది. ఆ తర్వాత సొంతంగా కష్టపడి ఉమ్మడి జిల్లా పాలిటిక్స్ లోనే స్ట్రాంగెస్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు.వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! *రాజకీయ జీవితం..
వినయ్ భాస్కర్ 1999, 2004లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ వెన్నుచూపకుండా వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. 2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2005 నుంచి 2009 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో కార్పొరేటర్ గా ఉన్నాడు. దాని ఫలితమే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసన సభకు వెస్ట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు.వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! తెంలగాణ ఉద్యమ సమయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. 2010 ఉపఎన్నికల్లో తిరిగి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2014, 2018 లలో టీఆర్ఎస్ గా వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2015 జనవరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కార్యాలయం పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు. 2019, సెప్టెంబర్ 7న ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్ నియమితులయ్యాడు. 2022 జనవరి 26 నుంచి దాస్యం వినయ్ భాస్కర్ టీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యాడు. అక్కడి నుంచి మొదలైన వినయ్ భాస్కర్ విజయ ప్రస్థానం ఎలాంటి బ్రేకులు లేకుండా సాగిపోతోంది. వరుసగా 4 సార్లు గెలిచి సత్తా చాటారాయన.

*వెస్ట్ లో దాస్యంనే ఎందుకు బెస్ట్ అంటున్నారు !
వరంగల్ వెస్ట్ నుంచి వినయ్ భాస్కర్ 4 సార్లు గెలవడం అంటే అంత ఈజీ కాదు. దాని వెనక ఆయన కృషి ఎంతో ఉంది. పేరుకు తగ్గట్టే తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎంత వినమ్రంగా ఉన్నారో, ఇప్పటికే అదే వినయం ఆయనలో ఉంది. ప్రతీ రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక చోట పర్యటిస్తారాయన. ఉదయం 10 గంటల్లోపే ఎక్కడో ఒకచోట వినయ్ భాస్కర్ పర్యటిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కొంచెం పొలిటికల్ గా ఫేమ్ అయ్యారంటే చాలు ఉదయం 10 గంటలు దాటితే కానీ ఇల్లు దాటరు కొంతమంది నాయకులు.వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! అలాంటిది వినయ్ భాస్కర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అదే వినయంతో, అదే టైం పంక్చువాలిటీతో తన కార్యక్రమాలకు బ్రేకులు లేకుండా, ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఇప్పటికీ నియోజకవర్గంలో ఏదో ఒక మూల పర్యటిస్తూనే ఉంటారు. ఆయనకు తెలిసింది ఒక్కటే. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం. అందుకే వెస్ట్ నియోజకవర్గ ప్రజలు వినయ్ బెస్ట్ అంటూ, ఆయనకే పట్టం కడుతున్నారు.

*ఇప్పటికీ వరించని మంత్రి పదవి..
వినయ్ భాస్కర్ గురించి తెలిసిన వాళ్లు చాలామంది చెప్పేది ఒక్కటే. ఆయన ఎప్పుడో మంత్రి కావాల్సింది. కానీ ఎక్కడ ఒకమూల అదృష్టం ఆయన వెన్నంటి ఉండడం లేదట. అందుకే ప్రతీ సారి మినిస్ట్రీ రేసులో ముందుకొచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్ రెండోసారి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వినయ్ భాస్కర్ మంత్రి కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి ఆయనకు లక్ కలిసి రాలేదు. చివరకు వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారు సీఎం కేసీఆర్.వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! * వినయ్ జోష్ ను భేష్ అంటున్న ప్రతిపక్షాలు
మంత్రి పదవి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినా, ప్రభుత్వ చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చినా వినయ్ భాస్కర్ మాత్రం తన ప్రయాణం ఆపలేదు. అదే జోష్, అదే నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. అందుకే ఎన్నికల వాతావరణంలోనూ వెస్ట్ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ కు ప్రత్యర్థే లేడని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నారట. ఈ స్థాయిలో కష్టపడే ఎమ్మెల్యే ఉంటే, ఇతర పార్టీలకు స్థానం ఎక్కడ ఉంటుందని ప్రతిపక్షాల క్యాడర్ ..తమ పార్టీ నేతలతో చెబుతున్నారట.అందుకేనేమో వినయ్ భాస్కర్ కు ప్రత్యర్థి ఎవరో చెప్పాలంటే కాంగ్రెస్, బీజేపీలు ఆలోచిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు వెస్ట్ నియోజకవర్గాన్ని స్కిప్ చేసేందుకే ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు టాక్.

ఒకవేళ పొత్తులు కుదిరితే ఫ్రెండ్లీ పార్టీకి సీటు ఇచ్చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయా పార్టీలకు వినయ్ భాస్కర్ ను ఢీకొట్టే ధైర్యం లేకపోవడంతోనే ఈ ఆలోచనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వినయ్ భాస్కర్ లా నియోజకవర్గంలో ప్రతీ రోజూ తిరగడం మా వల్ల కాదని చెప్పేస్తున్నారట. ఆస్థాయిలో అలుపెరుగకుండా కష్టపడుతున్నారు వినయ్ భాస్కర్.వెస్ట్ లో వినయ్ భాస్కరే బెస్ట్..! *వినయ్ కి ధీటైన ప్రత్యర్థి ఎవరో చెప్పడం కష్టమే!
వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పుడు వినయ్ భాస్కర్ కు ధీటైన ప్రత్యర్థి ఎవరో చెప్పడం కష్టమే. అందుకే వినయ్ భాస్కర్ మరోసారి గెలవడం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. భారీ మెజార్టీతో వినయ్ భాస్కర్ విజయఢంకా మోగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈసారి గెలిస్తే వినయ్ భాస్కర్ మంత్రి కావడం ఖాయమని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఆయన భారీ మెజార్టీతో మరోసారి సత్తా చాటుతారా? ఈ సారైనా మంత్రివర్గంలో చోటు సంపాదిస్తారా? తేలాలంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.