శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ 

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారైంది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే.