కాంగ్రెస్‌ సీనియర్‌ నేత‌ అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారు

గురుగ్రామ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ ట్రబుల్‌ షూటర్‌ అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారు. అక్టోబర్‌ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత‌ అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారుకాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్‌ నుంచి పలుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారిగా 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 వరకు మూడుసార్లు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1993 నుంచి రాజసభ్య సభ్యునిగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.