నేడు మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు

నేడు మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలుహైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి ప్రతిరోజు ఐదు నుంచి ఆరు రోడ్‌ షోలలో పాల్గొంటున్నారు. ఇవాళ మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అల్వాల్‌ ఇందిరాగాంధీ చౌరస్తా, సాయంత్రం 5 గంటలకు యాప్రాల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో, సాయంత్రం 6 గంటలకు ఆనంద్‌బాగ్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ నియోజకర్గంలోని ఈసీఐఎల్‌ చౌరస్తాలో, రాత్రి 8 గంటలకు నాచారం క్రాస్‌రోడ్‌లో, రాత్రి 9 గంటలకు ఉప్పల్‌ చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహిస్తారు.