ముగిసిన టోనీ ఫస్ట్ డే కస్టడీ విచారణ

ముగిసిన టోనీ ఫస్ట్ డే కస్టడీ విచారణహైదరాబాద్ : డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు టోనీ ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు టోనీని స్టేషన్ కు తరలించి విచారించారు. మొదటి రోజు విచారణలో భాగంగా టోనీ నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వ్యక్తిగత వివరాలతో అతని స్టేట్మెంట్ ను స్పెషల్ టీం రికార్డు చేసింది. టోనీ ఏజెంట్స్, డ్రగ్స్ నెట్ వర్క్ బ్రేక్ చేసే కోణంలో ప్రశ్నించారు. ముంబై, గోవా ఏజెంట్లతో హైదరాబాద్ కు ఉన్న లింక్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ టార్గెట్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టార్ బాయ్ కోణంలో ఇంగ్లీష్ లోనే టోనీని పోలీసులు ప్రశ్నించారు. స్టార్ బాయ్ కోసం ట్రాన్సలేటర్ సాయంతో పోలీసులు టోనీని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ లోని సప్లయర్స్ కు, టోనీకి లింక్స్ పై పోలీసులు ఆరా తీశారు.