లిక్కర్‌ స్కామ్‌ లో మాగుంట రాఘవకి ఈడీ కస్టడీ

లిక్కర్‌ స్కామ్‌ లో మాగుంట రాఘవకి ఈడీ కస్టడీ

లిక్కర్‌ స్కామ్‌ లో మాగుంట రాఘవకి ఈడీ కస్టడీ

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో మాగుంట రాఘవకి రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఈడీ కోరిన 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. సౌత్ గ్రూప్ తరపున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని, ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఈడీ వాదనలు వినిపించింది. తదుపరి విచారణ కోసం మాగుంట రాఘవను కస్టడీకి ఇవ్వాలని కోరింది. వాదనలను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. కస్టడీ సమయం ముగిసిన అనంతరం రాఘవని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.