పోలీసుల కస్టడీలో టోనీ

హైదరాబాద్ : డ్రగ్స్ రవాణా కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. ఫిబ్రవరి 2 వరకు పోలీసులు విచారించనున్నారు. దీంతో డ్రగ్స్ రవాణాకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. హైదరాబాద్ లో ప్రముఖులతో సంబంధాలపై ఆరాతీయనున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.