భారీగా పీడీఎస్ రైస్ బ్యాగులు పట్టివేత
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వర్ధన్నపేటలో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్ధన్నపేట పరిధిలోని డీసీఎంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ బ్యాగులను టాక్స్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 6,25,000/- ల విలువ చేసే పీడీఎస్ రైస్ బ్యాగులను స్వాధీనపరుచుకున్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ సతీష్ , వర్ధన్నపేట పోలీసులు , టాక్స్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.