హైదరాబాద్ : ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రజలు తరలిరావాలని ఉద్యోగ సంఘాల నేత మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన సైదాబాద్ డివిజన్లోని 39 పోలింగ్ స్టేషన్ విద్యా భారతి విజ్ఞాన కేంద్రం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే పాలకవర్గాన్ని ఎన్నుకోవడానికి ఓటు ఆయుధంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవడం లో నిర్లిప్తత చూపుతారని భావనని తొలగించి పోలింగ్ శాతం పెంచాలి ఆయన కోరారు.