ఓటుహక్కు వినియోగించుకున్న కేటీఆర్‌ ఆయన సతీమణి

ఓటుహక్కు వినియోగించుకున్న కేటీఆర్‌ ఆయన సతీమణిహైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ ఆయన సతీమణి శైలిమా తమ ఓటుహక్కు వినియోగించుకు న్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్‌ పోలింగ్‌బూత్‌ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఓటేసామని తెలిపారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.