జవాన్ ను హత్య చేసిన మావోలు

చత్తీస్ ఘడ్ : బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. పదునైన ఆయుధంతో దాడి చేసి జవాన్ ను మావోయిస్టులు హతమార్చారు. హత్య చేసిన తర్వాత, జవాను మృతదేహాన్ని గంగలూరు రోడ్డులోని సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలో విసిరివేశారు. అయితే మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం-శనివారం రాత్రి 10 మందికి పైగా మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారని బీజాపూర్ అదనపు ఎస్పీ పంకజ్ శుక్లా తెలిపారు.