భారత మాజీ ఫుట్ బాలర్ సుభాష్ ఇకలేరు

భారత మాజీ ఫుట్ బాలర్ సుభాష్ ఇకలేరుస్పోర్ట్స్ డెస్క్ : భారత మాజీ ఫుట్ బాలర్ సుభాష్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 యేళ్ల సుభాష్, శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సుభాష్ భోమిక్ ను అభిమానులు ప్రేమతో ‘భోంబోల్డా’ అని పిలిచేవారు. డయాబెటిక్ సమస్యలు, కిడ్నీ ఇబ్బందులతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈస్ట్ బెంగాల్ మోహన్ బగన్ జట్ల తరపున ఫుట్ బాల్ ఆడిన సుభాష్ , టీంలో స్ట్రైకర్ గా ఉండేవాడు. చాలా అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈస్ట్ బెంగాల్, మోహన్ బగన్, మొహమ్మదీన్ స్పోర్టింగ్, సాల్గోకార్, చర్చిల్ బ్రదర్స్ వంటి క్లబ్స్ కు కోచ్ గా కూడా వ్యవహరించారు.