పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతి

తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈమేరకు శనివారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతి

హైదరాబాద్ : 1997 కేడర్ కు చెందిన శైలజా రామయ్యార్ , అహ్మద్ నదీమ్, ఎన్.శ్రీధర్, ఎం.వీరబ్రహ్మయ్యను ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం వారు కొనసాగుతున్న చోటనే కొనసాగించింది. 2009 బ్యాచ్ కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఎన్. సత్యనారాయణ, అర్విందర్ సింగ్, ఎం.ప్రశాంతికి సెలక్షన్ గ్రేడ్ (పే-13 మ్యాటిక్స్ ) కు ప్రమోట్ చేసింది. అలాగే కె.శశాంక, శృతిఓజా, సీహెచ్ శివలింగయ్య, వి. వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్ కుమార్, కె. హైమావతి, ఎం. హరితను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ( లెవెల్ 12 పే మ్యాటిక్స్ ) పదోన్నతి ఇచ్చింది. రిజ్వాన్ భాషా, అనుదీప్ దురిశెట్టి, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, కోయ శ్రీహర్ష, హేమంత్ బోర్కండే, తేజస్ నంద్ లాల్ పవార్ , ఆదర్శ్ సురభి ను సూపర్ టైం స్కేల్ కు ప్రమోట్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

2004 బ్యాచ్ కు చెందిన తరుణ్ జోషి, శివకుమార్, కమలాసన్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ కు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కమలాసన్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, మిగతా అధికారులను ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2009 బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా, రెమా రాజేశ్వరికి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి ఇచ్చింది. 1997 బ్యాచ్ కు చెందిన తఖ్ ఫీర్ ఇక్భాల్ కు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1997 బ్యాచ్ విజయ్ కుమార్, నాగిరెడ్డికి, దేవేంద్ర సింగ్ చౌహాన్, సంజయ్ జైన్ కు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.