టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేంజ్

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేంజ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్ ను బుధవారం విడుదల చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఎగ్జామ్స్ టైం టేబుల్ ..
మే 23 – ఫస్ట్ లాంగ్వేజ్
మే 24 – సెకండ్ లాంగ్వేజ్
మే 25 – థర్డ్ లాంగ్వేజ్
మే 26 – గణితం
మే 27 – భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం
మే 28 – సాంఘీక శాస్త్రం
మే 30 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 31 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2
జూన్ 1 – ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు ( థియరీ), ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.