ఇక నుంచి అమలులోకి ఈ- టూరిస్ట్ వీసా

ఇక నుంచి అమలులోకి ఈ- టూరిస్ట్ వీసా

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 156 దేశాల పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చిలో నిలిపి వేశారు. ప్రస్తుతం జారీ చేయనున్న టూరిస్ట్ వీసాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే యూఎస్, జపాన్ పౌరుల దీర్ఘకాలిక ( పదేళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను సైతం పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.ఇక నుంచి అమలులోకి ఈ- టూరిస్ట్ వీసా