ఇతర దేశాలు వీసాలు తీసుకుని వచ్చేలా చేద్ధాం

ఇతర దేశాలు వీసాలు తీసుకుని వచ్చేలా చేద్ధాంవరంగల్ టైమ్స్, సంగారెడ్డి జిల్లా: బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో, బంగారు భారత దేశాన్ని కూడా తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తానని కేసీఆర్ తెలిపారు.

“తాను జాతీయ రాజకీయాల్లో పాల్గొంటున్నట్లు, పని చేస్తున్నట్లు కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లోకి, ఢిల్లీ దాకా పోయి కొట్లాడుదామా , భారతదేశాన్ని బాగు చేద్దామా, ఎట్ల తెలంగాణను బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాలి అని సీఎం కేసీఆర్ మాట్లాడారు. తప్పకుండా ఈ భారత దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనం అమెరికా పోవడం కాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకుని భారత్ కు వచ్చే పరిస్థితి చేసేంత గొప్ప సంపద, వనరులు, యువశక్తి మన దేశంలో ఉందని కేసీఆర్ తెలిపారు.
కాబట్టి మొదలు నేను పోరాటానికి బయల్దేరాను అని చెప్పారు. బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో, బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆదివారం మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాక్రే అగుతున్నరు, మీరు రైతు బంధు ఇస్తున్నరట, మీరు రైతు భీమా ఇస్తున్నరట, బార్డర్ వాళ్లు తెగ ఇబ్బంది పెడుతున్నరు, ఎట్లా ఇస్తున్నారో కాస్త చెప్పండి , మేం కూడా స్టార్ట్ చేస్తం అని అడిగారు. అందుకే తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతోంది. దేశం గురించి మనం కూడా కొట్లాడాలి. బంగారు భారతదేశాన్ని చేసుకోవాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.